తెలుగు తేజం, నందిగామ : నందిగామ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వాక్సినేషన్ సెంటర్ ను శాసనసభ్యులు డా.మొండితోక జగన్ మోహన్ రావు గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాపై అలుపెరగని పోరాటం చేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ముందుగా వ్యాక్సినేషన్ ఇవ్వడం సంతోషకరమని అదే విధంగా జిల్లాలో పలు కేంద్రాలలో కరోనా వ్యాక్సినేషన్ చేపట్టినట్లు తెలిపారు. అనంతరం వైద్య ఆరోగ్య సిబ్బంది ,ఏఎన్ఎంలు ,ఆశా వర్కర్ల తో మాట్లాడారు ,వ్యాక్సినేషన్ లో ప్రభుత్వం సూచించిన అన్ని జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కోవిడ్ టీకా పంపిణీ చేస్తుందని, కోవిడ్ టీకాపై కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, అవన్నీ అపోహలు మాత్రమే అని వాటిని పట్టించుకోవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని పరీక్షలు చేశాకే వ్యాక్సిన్ టీకాను పంపిణీ చేస్తుందని తెలిపారు.