తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం : కొండపల్లి గ్రామం లోని స్టేషన్ సెంటర్ పార్టీ ఆఫీసు నందు ఇబ్రహీంపట్నం ,కొండపల్లి గ్రామాల కలయికతో కొత్తగా ఏర్పడిన కొండపల్లి పురపాలక తెలుగుదేశం పార్టీకి- నూతన కార్యవర్గం ను ఎన్నిక చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి శ్రీ జువ్వ రాంబాబు , మాజీ జెడ్పీటీసీ సభ్యులు చెన్నబోయిన రాధా , మాజీ ఎంపీపీ గెత్తం కుమారి , మాజీ మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ గంగా మధుసూదన్ రావు , పార్టీ నాయకులు చెన్నబోయిన చిట్టిబాబు , చనుమోలు నారాయణ , సాకిరి వెంకట నరసయ్య , ధరణికోట లక్ష్మీపతి , ఎండ్లూరి సుబ్బానాయుడు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు చుట్టుకుదురు శ్రీనివాసరావు మాట్లాడుతూ మాపై విశ్వాసం ఉంచి మమ్మల్ని ఎన్నిక చేసిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కి , జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు కి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు కి, మాజీ మంత్రి- నియోజకవర్గ ఇంచార్జి దేవినేని ఉమామహేశ్వర రావు కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలుపుతూ మా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర పార్టీ కార్యదర్శి శ్రీ జువ్వ రాంబాబు కి ,జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు మరియు కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పార్టీ పూర్వ వైభవం తీసుకురావడానికి సాయశక్తులా పని చేస్తామని, అందరినీ కలుపుకొని రాబోవు పురపాలక ఎన్నికలలో విజయానికి కృషి చేస్తానని తెలిపినారు .చివరగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసినారు.
కొండపల్లి పురపాలక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చుట్టుకుదురు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా రావి మణిరాజ్ (ఫణి) , ఉపాధ్యక్షులుగా మైల సైదులు ,మిక్కిలి విజయకుమార్ అధికార ప్రతినిధిగా ఎంఏ హైదర్, కార్యదర్శులుగా చిమట ప్రసాద్ , వేముల శ్రీనివాస రావు , షేక్ గాలి సాహెబ్ , ఆకారపు కవిత , కార్యనిర్వహణ కార్యదర్శులుగా ఎండ్లూరి గోపి, నల్లమోతు ప్రసాద్ రావు , కంప కోటేశ్వరరావు , బొంత మురళి , లంకా రామకోటేశ్వరరావు, ప్రచార కార్యదర్శిగా కొత్తపల్లి ప్రకాష్, కోశాధికారిగా బాపనపల్లి సుబ్రహ్మణ్యం ఎన్నిక కావడం జరిగినది.