తెలుగు తేజం, విజయవాడ: నగర కమీషనరేట్లో కోడి పందాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా సీపీ కాంతి రాణా టాటా మాట్లాడుతూ కోడి పందాలకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. ఎవరైనా చట్టవ్యతిరేకంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలందరూ సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సీపీ కాంతి రాణా సూచించారు.