రాజమహేంద్రవరం: తెదేపా అధినేత చంద్రబాబును రాజమహేంద్రవరం జైలులో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కలిశారు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరఫున లూథ్రా న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే, కోర్టులో ఇవాళ జరిగిన పరిణామాలు, తదుపరి కార్యాచరణను లూథ్రా.. చంద్రబాబుకు వివరించినట్టు తెలిసింది. అన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం కనుచూపు మేరలో కనిపించనప్పుడు కత్తి పట్టడం సరైన చర్య అవుతుందంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా. పోరాటం చేయడం కూడా సరైన చర్యే అవుతుందని ఈ ట్వీట్లో కోట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు తరపున కోర్టులో వాదనలు వినిపిస్తున్న లూథ్రా, ఈ సమయంలో ఇలాంటి ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. పంజాబీల గురువు గురు గోబింద్ సింగ్ అప్పటి మొఘుల్ చక్రవర్తి ఔరంగజేబ్‌ను ఉద్దేశించి రాసిన జఫర్‌నామాలో ఈ మాటలున్నాయి. దీనికి సంబంధించి ఉర్దూలో గురుగోబింద్ సింగ్ మాటల ఫొటోను ట్యాగ్ చేశారు.