చాట్రాయి: చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బుధవారం ధర్నా చేశాయి. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ 31 కేసుల్లో నిందితుడిగా ఉండి 16 నెలలు జైలు చేసిన జగన్ రాష్ట్రంలోని నాయకులందరినీ జైలుకు పంపాలని ఆలోచన చేస్తున్నట్లు ఉందన్నారు. అవినీతి మరకలేని చంద్రబాబును స్కాం పేరుతో అరెస్టు చేయడం దారుణం అన్నారు. రానున్న ఎన్నికలలో జగన్ కు తగిన గుణపాఠం తప్పదు అన్నారు.