తెలుగుతేజం, జగ్గయ్యపేట : నియోజకవర్గంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న తరుణంలో ప్రజలందరూ తగు జాగ్రతలు తీసుకోని , సామజిక దూరం పాటిస్తూ , కచ్చితంగా మాస్క్ లను దరించి , ముక్యమైన 20 మంది వ్యక్తులతో ఈ ఏడాది శ్రీరామ నవమి పండుగను జరుపుకోవాలని సి ఐ పి.చంద్ర శేఖర రావు తెలియజేశారు, అలా కాకుండా గుంపులు గుంపులుగా పందిళ్ళ వద్ద్ ఉంటూ, కోవిడ్ నిబందలను పాటించని యెడల, నివారణ చర్యల్లో బాగంగా కోవిడ్ చట్టం ప్రకారం కటినమైన చర్యలు తీసుకోబడునని, అలాగే పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు అందరూ కుడా సామజిక దూరం పాటిస్తూ , సాద్యమైనంత వరకు ఇండ్లలోనే ప్రార్ధనలు/ నమాజు చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు.
ప్రజలందరూ పోలీస్ వారికీ సహకరిస్తూ ‘ తమని తాము కాపాడుకుంటూ ఇతరుల ప్రాణాలు కాపాడాలని ఆయన తెలిపారు.