నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఏకపక్షంగా విజయాలు కొనసాగడానికి కారణమయ్యిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చిత్ర పటానికి పాలాభిషేకం కార్యక్రమం, మరియు స్వీట్లు పంపిణీ, బాణసంచా పేలుళ్ళు వంటి కార్యక్రమం ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నీసా గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు అని చెప్పడానికి నేడు ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శమనీ అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమం వైపు ప్రజలు ఆకర్షితులు అవ్వుతున్నారనీ తెలిపారు. చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గ ములో కూడా టీడీపీ ని గెలిపించుకోలేని పరిస్థితి ఏర్పడిందనీ అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు లోకేష్ లు రాష్టాన్ని వదిలి వెళ్లి రాజకీయ సన్యాసం తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు ఎండీ షాహీన సుల్తాన హఫీజుల్లా, కొండాయ్యి గుంట మల్లీశ్వరి, స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.