తెలుగు తేజం, జగ్గయ్యపేట : కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పట్టణంలో నేడు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని మండల తాసిల్దార్ రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ రెండోదశ విజృంభిస్తున్న ఈ తరుణంలో కొన్ని రాజకీయ పార్టీల ప్రత్యేక కార్యాచరణ దృష్ట్యా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 144 సి ఆర్ పి సి కింద నిషేధాజ్ఞలు విధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కావున ఈరోజు (సోమవారం) ప్రజలు గుంపులు, గుంపులు తిరగటం గాని, మూకుమ్మడిగా ఒక చొక్క ఉండడం గాని నిషేధం అని తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో తెలిపారు.