ప్రమాదంలో గాయపడిన జనసేన కార్యకర్తలు
తెలుగు తేజం, పామర్రు : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం జరిగి నలుగురికి గాయాలయ్యాయి. బుధవారం పవన్‌కల్యాణ్ ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో పామర్రు మండలం కురుమద్దాలి పెట్రోలు బంకు సమీపానికి వచ్చే సరికి విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు ర్యాలీలోని రెండు ద్విచక్ర వాహనాలను, మరో వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో పెనమలూరు ప్రాంతానికి చెందిన అబ్దుల్ సుక్‌నబీ, పామర్రు మండలం జమీదగ్గుమిల్లికి చెందిన కేత పవన్‌జేత, తోట నరేంద్ర, పామర్రు శివారు శ్యామలాపురం వాసి గుమ్మడి వంశీలకు గాయాలయ్యాయి. ఇద్దరిని విజయవాడ, మరో ఇద్దరిని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేశామని పామర్రు ఎస్.ఐ శ్రీహరిబాబు తెలిపారు.