తెలుగు తేజం, కంచికచర్ల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటికి రేషన్ సరుకులు డోర్ డెలివరీ అవసరమైన ఫోర్ వీలర్ మినీ ట్రక్ సంబంధించి డ్రైవర్లకు శుక్రవారం నాడు కంచికచర్ల ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీడీవో కే శిల్పా అధ్యక్షతన ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీడీవో కే శిల్పా మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న రేషన్ సరుకులు డెలివరీ ప్రభుత్వం అందిస్తున్న ఫోర్ వీలర్స్ ట్రక్కు లకు డ్రైవర్ గా నియమించడానికి అర్హులైన వారి నుండి అర్జీలు స్వీకరించడం జరిగిందని కంచికచర్ల మండలంలో 195 మంది దరఖాస్తు చేసుకోగా శుక్రవారం జరిగిన ఇంటర్వ్యూల్లో 166 మంది అర్జీదారులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారని ఆమె తెలియజేశారు.కంచికచర్ల మండలం నుండి మొత్తము 15 తక్కువ డ్రైవర్లు కావాల్సి ఉండగా 166 మంది ఇంటర్వ్యూకు రావడం జరిగిందని మండలంలో మొత్తం యస్ సి కి సంబంధించి 5, బీసీకి 5, యస్ టి 1, మైనారిటీ కి 2, ఇబిసి 2 ఫోర్ వీల్స్ ట్రక్కులు మంజూరయ్యాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే శిల్ప ఆర్టీవో సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి కనగాల రవికుమార్, మరియు అర్జీదారులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.