తెలుగు తేజం, నందిగామ : నందిగామ ఓ సి క్లబ్ లో ఎలక్ట్రీషియన్స్ డే వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా యూనియన్ పతాకాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆవిష్కరించి థామస్ ఆల్వా ఎడిషన్ తో పాటు పలువురు చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు, అనంతరం ఎలక్ట్రీషియన్స్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డా”జగన్ మోహన్ రావు గారు మాట్లాడుతూ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ పడుతున్న ఇబ్బందులు ,సమస్యలను పరిష్కారానికి తనవంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని, ముఖ్యంగా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడంతో పాటు కుల ,మతాలు,పార్టీలకు అతీతంగా అందరికీ అందించేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు ,అదేవిధంగా ప్రైవేటు ఎలక్ట్రీషియన్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ,అనంతరం ఎమ్మెల్యేను ఎలక్ట్రీషియన్ లు ఘనంగా సత్కరించారు.