తెలుగు తేజం, మచిలీపట్టణం : ఏపీ సమాచార ప్రచారశాఖ మంత్రి పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. భవన నిర్మాణ కార్మికుడని నిర్ధారించిన కారణంగా మాజీ మంత్రిని వాటి వివరాలు ఉంటే సబ్మిట్ చేయమని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.
నవంబర్ 29న మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నంపై నాగేశ్వరరావు అనే వ్యక్తి తాపీతో దాడికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన అనుచరులు అతడిని పట్టుకొన్నారు. కాగా మంత్రి కాళ్ల మీద పడుతున్నట్లు నటించి మరోసారా ఆ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. మంత్రిపై దాడి చేసేందుకు రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. మంత్రి అనుచరులు అప్రమత్తమవడంతో పేర్ని నాని తృటిలో ప్రమాదం తప్పింది. ఆపై నిందితుడు నాగేశ్వరరావును పోలీసులకు అప్పగించారు. కాగా నిందితుడి టీడీపీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీని వెనుక టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఆయన స్పందిస్తూ….మంత్రిపై దాడికి, తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన విషయం తెలిసిందే.