తెలుగు తేజం, మోపిదేవి : కృష్ణ జిల్లా మోపిదేవి లో నాగులచవితి పండుగను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వయంభూగా వెలిసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం వేకువజామున అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి దంపతులు నాగ పుట్టలో పాలు పోసి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్ లీల కుమారు స్వామి వారి చిత్ర పటం ప్రసాదాలు వారికి అందజేశారు. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని నాగు పుట్టలో పాలు పోసారూ. పలువురు ముస్లిం భక్తులు కూడా పూజలు చేయడం. అవనిగడ్డ సిఐ రవికుమార్ ఎస్సైలు సందీప్, సురేష్, కానిస్టేబుల్ హోంగార్డు బందోబస్తులో పాల్గొన్నారు. భక్తులకు, ప్రసాదాలు మజ్జిగ పంపిణీ చేశారు దివ్యాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రధాన అర్చకులు పవన్ కుమార్ శర్మ, వేదపండితులు విశ్వనాథ్ సుబ్రహ్మణ్య శర్మ, ఫణి శర్మ, బాలకృష్ణ, అర్చకులు, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సహాయ అధికారులు పాల్గొన్నారు.