Breaking News

ఎన్నికల పేరుతో ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు : మంత్రి కొడాలి నాని

తెలుగు తేజం, గుడివాడ : స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో రాష్ట్రంలో ప్రజలను చంపే ప్రయత్నం చేయవద్దని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. బుధవారం రాజేంద్ర నగర్ లోని ఆయన నివాసం లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ హైదరాబాద్‌లో కూర్చుని ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారన్నారు. కరోనా సమయంలో ఈ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఇప్పటికే స్పష్టం చేశారని చెప్పారు.

ఒక్క పోలీస్‌శాఖలోనే 12 వేల మంది కరోనా బారిన పడ్డారని ఇంకా ఎన్నికల విధుల్లో పాల్గొనే రెవెన్యూ, విద్యాశాఖలో వేల మందికి వైరస్‌ సోకిందన్నారు. వీరిలో చాలా మంది అనారోగ్య సమస్యలతో విధులకు దూరంగా ఉన్నారని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థ లో ఉన్న నిమ్మగడ్డ రాజకీయ పార్టీల ముసుగులో ఉంటున్నారని ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.నిమ్మగడ్డ కు రాజ్యాంగ వ్యవస్థలు, ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన అవకాశానికి నిమ్మ గడ్డ ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని. వచ్చే ఏడాది మార్చిలో నిమ్మగడ్డ పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను తప్పుడు మార్గంలో నిర్వహించి ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆయనకు నిమ్మగడ్డ చెబుతున్నట్లుగా బ్యాలెట్‌ విధానంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తే వైరస్‌ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. గతంలో రెండు మూడు కేసులు ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే నిలిపివేసిన నిమ్మగడ్డ ప్రస్తుతం వెయ్యి నుంచి 1,500 వరకు కేసులు నమోదవుతుంటే ఎన్నికలు నిర్వహిస్తామని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. అధికారులు కూడా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేరని, దీనిపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పామని నాని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *