బహుముఖ వ్యూహంతో రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం
ప్రజాభాగస్వామ్యంతోనే ఇది సాధ్యం..
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించవద్దు- రవాణాశాఖ అధనపు కమిషనరు ఎస్.ఎ.వి. ప్రసాదరావు
తెలుగు తేజం, విజయవాడ : రోడ్డు భద్రతపై అవగాహన నిరంతర ప్రక్రియని ప్రతీ ఒక్కరిలో సామాజిక చైతన్యం తీసుకువచ్చేందుకు ఉద్యమించవలసిన అవసరం ఉందని సోషల్ మీడియా వేదికగా మరింత ప్రచారానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణాశాఖ అదనపు కమిషనర్ ఎస్.ఏ.వి. ప్రసాదరావు చెప్పారు. నగరంలోని ఉపరవాణా కమిషనరు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో అదనపు కమిషనరు ఎస్.ఏ.వి. ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొని కృష్ణాజిల్లా రవాణాశాఖ రూపొందించిన రోడ్డు భద్రతపై అవగాహనా పెంపొందించే విధంగా ఫేస్ బుక్ ఖాతాను ఆవిష్కరించి గాలిలోకి బెలూన్ లను ఎగుర వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డుభద్రత పై అవగాహన కలిగించేందుకు సామాజిక ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛంధ సంస్థలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో రహదారి భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల వలన ఏడాదికి 8 వేలమంది మరణిస్తున్నారని,
గత ఏడాది కరోనా విపత్తు సమయంలో రోడ్డు రవాణా లేని కారణంగా మరణాలు సంఖ్య 7 వేలకు తగ్గిందన్నారు. ప్రతీ ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. చిన్నపిల్లలకు తల్లిదండ్రులు లైసెన్స్ లేకుండా వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. దేశవ్యాప్తంగా సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 71 శాతం కేవలం అతివేగం వల్లే
జరుగుతున్నాయన్నారు. వివేదికల ప్రకారం ఏడాదికి భారతదేశంలో సుమారు 5 లక్షల రహదారి ప్రమాదాలు జరుగుతుండగా ఇందులో లక్షన్నర మంది మరణిస్తున్నారని వారిపై ఆధారపడిన వేలాది కుటుంబాలు వీధిపాలవుతున్నారని, ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తెరగాలని కోరారు. ప్రమాదాల్లో సుమారు 3 లక్షలమంది గాయాలపాలు అవుతున్నారని, వీరిలో కొందరు వికలాంగులుగా మారుతుండడం దురదృష్టకరమన్నారు.
ఉపరవాణాకమిషనరు యం. పురేంద్ర మాట్లాడుతూ జిల్లాలో జనవరి 18 నుంచి ఫిబ్రవరి 17 వరకు 32వ జాతీయ
రహదారి భద్రతా మాసోత్సవాలు ఘనంగా నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయడం జరిగిందన్నారు. రహదారి
భద్రత మాపోత్సవాల్లో భాగంగా వివిధ కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం వాహనచోదకులకు ప్రత్యేక చైతన్య కార్యక్రమాలను నిర్వహించి రోడ్డు భద్రతపట్ల అవగాహన కల్పించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించబోమని
ప్రతిజ్ఞలు చేయించడం జరిగిందన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కలిగించే వర్క్ షాపులు నిర్వహణ, 2019 మోటారు వాహనాలు సవరణ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ విబంధనలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే క్రమంలో పోషల్
మీడియాను వేదికగా వినియోగించుకుని విస్తృత ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ప్రత్యేక పేస్బుక్ ఖాతాను రూపొందించామన్నారు. ట్రాఫిక్ నియమాలు తూచతప్పకుండా పాటించడమే ప్రతీ ఒక్కరి జీవితానికి రక్ష అన్నారు. రహదారి ప్రమాదాల్లో మరణించినవారిలో 70 శాతం మంది 15 నుంచి 45 సంవత్సరాల వయస్సు
ఉన్నవారేనని అన్నారు.
ఈ ప్రమాదాలను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాలను, మరణాలను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా రవాణాశాఖ కృషి చేస్తున్నదన్నారు. వాహనదారులు ద్విచక్రవాహనాలు, కార్లలో
ప్రయాణించేటప్పుడు వారి వ్యక్తిగత భద్రత కోసం హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. ప్రతీ ఒక్కరూ ఇది వారి సామాజిక బాధ్యతగా గుర్తించాలని పురేంద్ర హితవు పలికారు.
కార్యక్రమంలో వీడు స్వచ్ఛంధ సంస్థ ప్రతివిధి యం.వాసు, రవాణాశాఖ ఆర్ టిఓలు కె. రామ్ ప్రసాద్, ఏ. విజయసారథి,
మోటారు వెహికల్ ఇన్సపెక్టర్లు జి. సంజీవకుమార్, కెఆర్. రవికుమార్,జె నారాయణస్వామి, కార్యాలయ పరిపాలనా అధికారి సిహెచ్. శ్రీనివాసరావు, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షులు యం. రాజుబాబు, ఉద్యోగులు, శిక్షణ పొందుతున్న డ్రైవర్లు, వాహనదారులు, తదితరులు పాల్గొన్నారు.