తెలుగు తేజం, విశాఖ: విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. అక్కడ ఉన్న రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఆయన సందర్శించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవమూర్తి, దాసాంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకున్న సీఎం.. అనంతరం రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులను జగన్ సత్కరించారు. ఆ తర్వాత శారదాపీఠం వెబ్సైట్ను సీఎం ఆవిష్కరించారు. అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో ఉక్కు పరిరరక్షణ సంఘం ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఈ సందర్భంగా సీఎం వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం.