తెలుగు తేజం, కంచికచర్ల : రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోమవారం కంచికచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు, మండల బూత్ కన్వీనర్ అధ్యక్షుడు మార్తా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జాతీయ రహదారి పక్కన సీఎం జగన్ కటౌట్ వద్ద కేక్ కటింగ్ కార్యక్రమాన్ని రాష్ట్ర వైసిపి అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ చేతుల మీదగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూభారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి ఒక్క ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ప్రజల శ్రేయస్సు వారి అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తూ ముందుకు అడుగులు వేస్తూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యని సచివాలయం,వాలింటరీ వ్యవస్థ ద్వారా ఇంటి ముందుకు తీసుకు వచ్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. మహిళలు రాజ్యాధికారం లో సగభాగం కావాలనే ఆకాంక్షతో వారికి 50 శాతం పదవులలో రిజర్వేషన్ కల్పించిన స్ఫూర్తి దాత వైయస్ జగన్ అని, ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టిన హామీలే కాక తన మదిలో నుంచి వచ్చిన కొత్త హామీలు సైతం 90% హామీలను నెరవేర్చిని ఘనత జగన్ కే దక్కుతుందని తెలియజేశారు. ప్రతి పక్షాలు సైతం నోటి మీద వేలు వేసుకొని చూస్తూ ఉండిపోయేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న దమ్మున్న నాయకుడు జగన్ అని ఇలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా జగన్ లాంటి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుతున్నారని ఆయన తెలియజేసింది. దేశంలోనే కరోనా సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను ఎందరో మేధావులు హార్షించారు, తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ తనదైన ముద్ర వేసుకుంటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల ముంగిటికి అందజేసారు.
ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు బూత్ కన్వీనర్ అధ్యక్షుడు మార్తా శ్రీనివాసరావు, అబ్బూరి నాగమల్లేశ్వరరావు, వేల్పుల శ్రీనివాసరావు, బండారు పల్లి శబరి మాడుగుల మధు,బచ్చు వెంకటేశ్వరరావు, నన్నపనేని నరసింహారావు,పెద్దమళ్ళ భద్రయ్య,పోన్నపల్లి శ్రీనివాసరావు, పరిటాల రాము, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి, మంగళంపూడి కోటి బాబు, సన్నీ, బండారు పల్లి సత్యనారాయణ, బుడ్డి సత్యానారయణ,వెలగ బాబు,శింగంశెట్టి సురేష్,మేకల బాబు, తంగిరాల సుజిని,గుగ్గులోత్ శివ నాయక్, వేముల గోపి,కావటి ఆదినారాయణ,ఒంటిపులి ప్రసాద్ అమర్లపూడి చంద్రయ్య ఉస్తేల నరశింహరావు,గదే బుజ్జి,తేళ్ళ లోకేశ్,కలతోటి అజేయ్ కుమార్, బుచ్చిబాబు, బడేటి మల్లీశ్వరావు యర్రంశెట్టి బాలయ్య,శేషం మధు, తదితరులు పాల్గొన్నారు