సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ గుంటుపల్లి వ్యాగన్ వర్క్ షాపు బ్రాంచి కార్యదర్శి గద్దా సురేష్
తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం : మహిళలు అన్ని రంగాలతో పాటు జాతీయ రైల్వేలో కూడా వివిధ హోదాల్లో పనిచేస్తూ రైల్వేల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ గుంటుపల్లి వ్యాగన్ వర్క్ షాపు బ్రాంచి కార్యదర్శి గద్దా సురేష్ అన్నారు. ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా ప్రతి ఏటా మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. వర్క్ షాపులో మహిళా కార్మికుల కోసం సంఘ్ సాధించిన విజయాలను వివరించారు. మహిళా కార్మిక శక్తిని కొనియాడారు. మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో దారా కరుణశ్రీ, అధికారులు శ్రీరామకృష్ణ, సంపత్ కుమార్, ఏడుకొండలు, యూనియన్ బ్రాంచి అధ్యక్షుడు శివనాగేశ్వరరావు, వర్కింగ్ చైర్మన్ డి.డేవిడ్ రాజు, కోశాధికారి ఆంజనేయులు, జి.సుధాకర్, బోయజ్, లాలియా నాయక్, రబ్బాని, పాండురంగారావు, జోసఫ్ రాజు తదితరులు పాల్గొన్నారు.