పెనుగంచిప్రోలు (తెలుగుతేజం) ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ మద్యం అరికట్టడమే లక్ష్యంగా మండల పరిధిలో అనేక గ్రామాలలో దాడులు నిర్వహించి అక్రమ మద్యం దారుల ఉనికిని పసిగడుతూ వారి వ్యాపారాలకు అడ్డుకట్ట వేస్తూ వరుస అక్రమ మద్యం దాడులలో సంచలనం సృష్టిస్తూ అక్రమ మద్యం దారులను భయాందోళనలకు గురి చేస్తున్న ఎస్ ఐ రామకృష్ణ ఆదివారం అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 317 మద్యం బాటిళ్లను, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్న సంఘటన మండలంలోని కొలికోళ్ల, మరియు వెంకటాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ నందు డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి, సీఐ చంద్రశేఖర్, ఆధ్వర్యంలో ఎస్ ఐ రామకృష్ణ సమక్షంలో పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎస్ఐ రామకృష్ణ కు వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బంది అయిన హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్, కానిస్టేబుల్ ఉపేంద్ర, బాలకృష్ణ లతో కలిసి తనిఖీలు నిర్వహించగా కొలికోళ్ల
గ్రామానికి చెందిన కంచం వెంకటేశ్వర్లు సన్నాఫ్ బసవయ్య, గుంటుపల్లి వెంకటేశ్వర్లు సన్నాఫ్ ఏడుకొండలు, గాలం గంగయ్య సన్నాఫ్ వెంకటేశ్వర్లు, వెంకటాపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ రాంబాబు సన్నాఫ్ రామకృష్ణ, ఈ నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 317 మద్యం బాటిళ్లను, (సుమారు రూ30,000/)ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. అక్రమ మద్యం రవాణా చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.