విశాఖపట్నం: విశాఖ రైల్వే జోన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి సమావేశంలో రైల్వే జోన్ అంశమే చర్చకు రాలేదన్నారు. విశాఖకు రైలే జోన్ వచ్చి తీరుతుందన్నారు. విశాఖకు రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంపై అక్కసుతోనే ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని దుయ్యబట్టారు