అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హత గల ఉద్యోగులకు జూన్ నెలలో ప్రొబేషన్ డిక్లర్ చేసి, జూలై నుంచి పెరిగిన వేతనాలు అందజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా హామీ ఇచ్చారని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు.వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సర్వే శాఖలో ప్రమోషన్లు కల్పిపించేలా రీ–ఆర్గనైజ్ చేసి 410 పోస్టులకు అప్గ్రేడ్ ప్రమోషన్ అవకాశాలు కల్పించిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపామన్నారు. సర్వే డిపార్ట్మెంట్లో 410 మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్య పరిష్కారమైందన్నారు. అసోసియేషన్ ప్రతినిధుల బృందం సీఎం క్యాంపు కార్యాలయంలోనే డీజీపీ రాజేంద్రనా«థ్రెడ్డిని కలిసి మహిళా పోలీసుల సమస్యలను వివరించిందని చెప్పారు.