ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు కరోనా

హైదరాబాద్‌ (తెలుగు తేజం ప్రతినిధి): ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ నెల 15న పరీక్షలు జరపగా ఇవాళ కరోనా పాటిటివ్‌ తేలిందన్నారు. ప్రస్తుతం గవర్నర్‌ బిశ్వభూషన్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఏఐజీ వైద్యులు తెలిపారు. కాగా, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను స్వస్థతకు గురికావడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *