Breaking News

భారీ పెట్టుబడులకు బైడెన్‌ ప్రణాళిక

2.3 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీ ప్రకటన

వాషింగ్టన్‌: తరానికి ఒకసారి మాత్రమే వెచ్చించే అతి భారీ పెట్టుబడుల ప్రణాళికను తాము తీసుకొస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఈ మేరకు 2.3 ట్రిలియన్‌ డాలర్ల విలువైన (సుమారు రూ.168 లక్షల కోట్ల) పెట్టుబడులను ప్రతిపాదించారు. మౌలిక సదుపాయాలను ఆధునికీకరించేందుకూ; వాతావరణ మార్పుల కారణంగా ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకూ; పోటీ ప్రపంచంలో అమెరికాను దీటుగా నిలిపేందుకూ ఈ ప్రణాళిక ఇతోధికంగా దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. పెన్సిల్వేనియాలోని పీట్స్‌బర్గ్‌ నుంచి గురువారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ”మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్ధకు జవసత్వాలు తెచ్చేందుకు ఇటీవలే 1.9 ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాం. రాబోయే ఎనిమిదేళ్లలో మౌలిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు 2.3 ట్రిలియన్‌ డాలర్ల ప్రతిపాదనలు చేస్తున్నాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత… అమెరికాలో అతిపెద్ద ఉద్యోగాల కల్పన పెట్టుబడి ఇదే. ఈ ప్రణాళిక అమలైతే నాలుగేళ్లలో 1.8 కోట్ల అధిక వేతన ఉద్యోగాలు సృష్టించవచ్చు’ అని బైడెన్‌ చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *