తెలుగు తేజం, విజయవాడ: యువత చేడు వ్యసనాలు మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని,మంచి జీవిత లక్ష్యాల వైపు పయనించాలని కలెక్టర్ ఇంతియాజ్ పిలుపునిచ్చారు. నషా ముక్త భారత్ అభియాన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగం వాటి దుష్ప్రరిణామాలపై అవగాహన కలిగించే సైకిల్ ర్యాలీని సోమవారం తన క్యాంపు కార్యాలయం వద్ద కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొంతమంది స్వార్థపరులు తమ స్వలాభం కోసం యువతను లక్ష్యంగా చేసుకొని మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారని వారి వలలో చిక్కుకోవద్దని ఉద్బోధించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల నిత్యపర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ సూచించారు. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత వారు జాతీయ స్థాయిలో మాదక ద్రవ్యాల ఎక్కువగా వినియోగించే జిల్లాలను గుర్తించగా అందులో కృష్ణాజిల్లా ఉన్నట్లు పేర్కొన్నారు . మాదకద్రవ్యాల విక్రయాల సరఫరాలో నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కెవి.శ్రీనివాసులు, జేసీ. ఎల్.శివశంకర్, కె.మోహన్‌కుమార్, నషాముక్త భారత్ అభియాన్ ప్రచార కమిటీ కన్వీనర్ ఏవిడి.నారాయణరావు, ఎస్ఆర్ ఆర్, కేబీఎన్ కళాశాలల ప్రిన్సిపాల్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు