తెలుగు తేజం, విజయవాడ టిడిపి నాయకులు మాల-మాదిగ సామాజికవర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కుట్రలు చేస్తున్నారని మాల-మాదిగ ఐక్యవేదిక కన్వీనర్ మేదర సురేష్ ఆరోపించారు. సోమవారం గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో మాల మాదిగల ఐక్య వేదిక ఆధ్వర్యంలో తమ సామాజికవర్గాలకి వైసీపీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తుంటే ప్రతిపక్ష పార్టీ నీచ రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. రాజకీయ పార్టీలు రాజకీయ లబ్దికై కోసం మాల-మాదిగల మధ్య అనేక అంతరాలు సృషించారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న సామాజికవర్గాల పెద్దలు మాల-మాదిగ సామాజిక వర్గాల మధ్య వైరం సృష్టించవద్దని హితవుపలికారు.మాలమాదిగలు ఐక్యంగా ఉన్నారని అన్నారు. పెద్దలుగా వ్యవహరిస్తూన్నా వ్యక్తులు మా మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ కుట్రలు చేస్తుందని అన్నారు. సామాజికంగా తమ సామాజికవర్గం ఇంకా వెనుకబడే ఉందని, తమ హక్కుల కోసం ఐక్యంగా ఉండి పోరాడుతామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తుంటే ప్రతిపక్ష పార్టీ రాజకీయ కుట్ర పన్నుతుందని మండిపడ్డారు. మాల-మాదిగ సామాజిక ఐక్యత కోసం త్వరలో బస్సు యాత్ర చేపడుతామని పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ జేఏసీ అధ్యక్షుడు తుమాటి బాబురావు మాట్లాడుతూ మాల మాదిగలు అన్న దమ్ముల వలే కలసి ఉన్నారని మాల-మాదిగ ల ఐక్యత చెడగొట్టేందుకు కుట్రలు జరగుతున్నాయని ఈ కుట్రలకు బలి అవ్వొద్దని సూచించారు. బడుగు-బలహీన వర్గాలు ఆర్ధికంగా బలపడేందుకు జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకలు ప్రవేశాలు పెడుతున్నారని చెప్పారు. అన్నదమ్ముల లాంటి వ్యక్తుల మధ్య చిచ్చులు పెట్టవద్దని కోరారు.మాలమాదిగలు చేతికి ఐదు వేళ్ళని కలిసే ఉంటామని అన్నారు.నాడు 32వ రాజ్యాంగ సవరణకు పార్లమెంట్ ఆమోదం పొందలేక పోతుంటే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జగ్జీవన్ రావు సహయంతో 32 వ రాజ్యాంగ సవరణ చేశారని అన్నారు.అదేవిధంగా పార్లమెంటు లో జగ్జీవన్ రావుకు పదవి రావడానికి అంబేద్కర్ సహయం చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో పిళ్ళావెంకట, విలియం రాజ్ తదితరులు పాల్గొన్నారు