మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య.
కంచికచర్ల మండలం : బత్తినపాడు గ్రామం నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారాన్ని నిరసిస్తూ గ్రామస్తులు, దేశం నాయకులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య.
తంగిరాల సౌమ్య మాట్లాడుతూ…
రేషన్ పై బాదుడు, రాష్ట్ర రహదారుల పై టోల్ భాదుడు సామాన్య ప్రజానీకానికి తప్పని పన్నుల భారం
రేషన్ సరుకుల పై పన్నుల భారంతో ఏటా పేద ప్రజానీకం పై 600 కోట్ల రూపాయల భారం.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 50 శాతం రాయితీతో పేద ప్రజానీకానికి సరుకులు అందచేస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరలో 25 శాతం సబ్సిడీ మాత్రమే ఇస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిది!
రాష్ట్రరహదారులపై ఇకపై టోల్ బాదుడు, 45 నుంచి 60 కిలోమీటర్లకి ఒక టోల్ గేట్
ఇప్పటికే 35రహదారుల ఎంపిక? దెబ్బతిన్న రోడ్లు,భారీగుంటలతో ప్రజలఇబ్బందులు.
18 నెలలుగా కనీసమరమ్మతులు చేపట్టని వైసీపీ ప్రభుత్వం
విచ్చలవిడిగా పెట్రోల్,డీజిల్ పై టాక్స్, టోల్ టాక్స్ ఏవిధంగా వసూలుచేస్తారో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి?
రాష్ట్ర అభివృద్ధి చూస్తే శూన్యం
పంటలకు గిట్టుబాటు ధరలు లేవు, కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు సరిగా జరగడం లేదు, గత సంవత్సరం, ఈ సంవత్సరం పంట నష్టాలు రైతుల ఖాతాలకు జమ కాలేదు వీటన్నింటిని మరచిన రాష్ట్ర ప్రభుత్వం టోల్ బాదుడు, రేషన్ బాదుడులు పక్కన పెట్టి అన్నం పెట్టే రైతన్న కష్టాలపై దృష్టి కేంద్రీకరించాలని ఆమె సూచించారు