తెలుగు తేజం, నందిగామ : అప్పుల బాధతో ఆత్మ హత్య చేసుకొన్నా రైతు కట్టా లక్ష్మీనారాయణ మృత దేహాన్ని నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ నందు మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య తెదేపా నాయకులతో కలిసి సందర్శించారు ఈ సందర్బంగా సౌమ్య మాట్లాడుతూ చందర్లపాడు పత్తి రైతు లక్ష్మి నారాయణ ఆత్మహత్య కు కారకులెవరో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె అన్నారు. నందిగామ మార్కెట్ యార్డు నందు ఉంచిన పత్తి కోనుగోలు చేయకుండా ఉండటం వలన ఈ రోజు ఒక రైతు నిండు ప్రాణం గాలిలో కలసిపోయందని వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే కులం చూడం,మతం చూడం, పార్టీలు చూడం అన్నారు కానీ ఈ రోజు చనిపోయిన లక్ష్మినారాయణ గారు తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానినని అన్ని వివరాలతో వైయస్ జగన్ కు లెటర్ రాసినట్లు సూసైడ్ నోట్ లో స్పష్టంగా కనపడుతుంది. నిన్న నందిగామ మార్కెట్ యార్డు లోనే ఆత్మహత్య ప్రయత్నం చేసిన లక్ష్మి నారాయణ 25 నిద్ర ట్యాబ్లెట్లు మింగిన మరణించక పోవడం తో మంగళవారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ప్రకృతి కన్నుఎర్ర చేస్తే దానికి రైతు దా తప్పు? లక్ష్మి నారాయణ గత సంవత్సరపు పత్తిని ఇప్పటి వరకు ఎందుకు కొనుగోలు చేయలేదు మార్కెట్ యార్డు సిబ్బందా? ప్రత్తి కోనుగోలు చేసే బయ్యరా? సమాధానం చెప్పేదెవరు? ఇక్కడ జరుగుతున్న అవినీతి, వీళ్ల పోకడలను రాష్ట్ర ముఖ్యమంత్రి కే లెటర్ లు రాశారంటే లక్ష్మినారాయణ ఎన్ని ఇబ్బందులు పడ్డారో?
పత్తి పంట తీసే సమయానికి కూలీల కరువు, కూలీలు దోరికిన సమయం లో పండిన పత్తి నేలపాలు ఇన్ని ఇబ్బందుల మద్య యార్డుకు చేరిన పత్తి దళారుల పాలు తప్ప రైతు బాగుపడిందేది? రాష్ట్ర ప్రభుత్వం రైతు లక్ష్మినారాయణ ఆత్మహత్య పై స్పదించాలి వారి కుటుంబ సభ్యులకు తగిన నష్ట పరిహారం చెల్లించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేసారు