గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హనుమాన్ జంక్షన్ లో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం లో హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య క్షీరాభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు తండోపతండాలుగా రావడంతో దేవస్థానం ఆవరణం హనుమాన్ నామస్మరణలతో మారుమ్రోగటంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రముఖులు కనుమూరి సూర్యనారాయణ రాజు ఆయన కుటుంబ సభ్యులు ఆలయ కమిటీ చైర్మన్ నేరుసు భూషణం దంపతులు, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, హనుమాన్ జంక్షన్ సి ఐ సతీష్ దంపతులు పెదపాడు మండలం వైకాపా అధ్యక్షుడు అప్పన ప్రసాద్ , ఆల…