వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలను నెరవేరుదాం! సర్పంచ్ బి శ్రీనివాసరావు
తెలుగు తేజం, వత్సవాయి : మండలములోని గోపినేనిపాలెం గ్రామములో శనివారం సర్పంచ్ మరియు వార్డు నెంబర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మాగాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సర్పంచ్ బాణవతు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత పాలనలో గ్రామములో వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తప్ప మిగతా సందర్భాలలో కనుమరుగయ్యే వారని, వారి పరిస్థితి దయానకంగా ఉండేదని, అటువంటి పరిస్థితి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉండకూడదని, పంచాయతీ పరిధిలో వాలంటరీలకు, పంచాయతీ సిబ్బందికి, పంచాయతీ పరిధిలో పలు శాఖల అధికారులకు ప్రజల పైన ఎంత అధికారం ఉన్నదో అంతే అధికారం వార్డు నెంబర్లకు కూడా ఉందని, ప్రతి ఒక్కరం మనలను నమ్మి గెలిపించిన ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా అందరము కృషి చేయాలని అన్నారు. గ్రామములో ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సమస్య, వీధిలైట్లు ఇలా పలు సమస్యలు ఉన్నచో తమకు తెలియపరచాలని అన్నారు. గత 25 సంవత్సరాలుగా మన గ్రామము లో ఒకే పార్టీ ఆధిపత్యంతో పరిపాలించడం అందరికీ విధి తమే! అటువంటి చరిత్ర ఉన్నటువంటి గ్రామంలో ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అటువంటి పదకాలు స్థానిక శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను పార్టీలకు, కుల మతలకు అతీతంగా అందించడం వల్లే ఇంతటి ఘన విజయాన్ని సాధించామని అన్నారు. ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు ఎస్కే మస్తాన్ వలి, సురేష్, వైస్ ప్రెసిడెంట్ కామినేని రాంబాబు, వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది, వాలంటరీలు, సచివాలయం సిబ్బంది, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.