తెలుగు తేజం, కంచికచర్ల : పరిటాల కొత్తపేట గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి నివెశిత స్థలాలను తక్షణమే ప్రభుత్వం కేటాయించాలని ప్రభుత్వం కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, దేశం నాయకులతో కలిసి డిమాండ్ చేశారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామం వైయస్సార్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల్లో పరిటాల గ్రామంలో అక్రమ వ్యాపారానికి పునాది వేస్తున్నారు పరిటాల గ్రామంలో 1000 మంది లబ్ధిదారులు ఉండగా 600 మందికి ఇంటి స్థలం నిర్మాణం చేస్తాననడం అధికారులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. కంచికచర్ల మండలం, కొత్తపేట గ్రామంలో 4.5 ఎకరాల భూమిని ఒక ప్రైవేటు వ్యక్తి దగ్గర ఇంటి స్థలాల కోసం తీసుకొని భూ బదలాయింపు పేరుతో పరిటాల లబ్ధిదారులకు అధికారులు ఎంపిక చేసిన MVR కళాశాల దగ్గర ఉన్న ఒక అసైన్డ్ పొలాన్ని ఒక ప్రైవేటు వ్యాపారస్తులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న అధికారులు ప్రజా ప్రతినిధులు. ఇంటి స్థలం నిరుపేదలు దక్కేలా ఉండాలి అధికారులు ఇప్పటికైనా ఈ అడ్డగోలు వ్యాపారానికి స్వస్తి పలకాలి లేకుంటే టిడిపి పార్టీ పేదవాడికి అండగా ఉద్యమానికైనా సిద్ధంగా ఉంటుంది. లేకుంటే ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు దీనికి బాధ్యత వహించాలి. టిడిపి పార్టీ మాజీ శాసనసభ్యులు తంగిరాల స్వామి డిమాండ్ చేశారు భూ బదలాయింపు లో భాగంగా పరిటాల ఇళ్ల స్థలాల పై అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ కంచికచర్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలియజేశారు. అనంతరం భూ బదలాయింపు పై డిప్యూటీ తాహశీల్దార్ గారికి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వినతి పత్రాన్ని దేశం నాయకులతో కలిసి అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు వేమ వెంకట్రావు. టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు, దేశం నాయకులు మాగంటి బాబు, గణపతి సాంబశివరావు, గుర్రం రామకృష్ణ ప్రసాద్ బండ్లమూడి బుజ్జి, ఒంటి పులి శివ శంకర్, షేక్ తార బి, ఎస్ డి రసూల్ బి, షేక్ నాగుల్ బి, షేక్ చైనా బి , సయ్యద్ ఖత్తి జాబీ ఇతరులు పాల్గొన్నారు