Breaking News

ఓటీటీల నియంత్రణ చర్యలపై యోచిస్తున్నాం

ఉన్నత న్యాయస్థానానికి తెలిపిన కేంద్రం

దిల్లీ: ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) ఫ్లాట్‌ఫాంలపై నియంత్రణ చర్యలు తీసుకొనే యోచనలో ఉన్నట్లు కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనానికి కేంద్రం వెల్లడించింది. ఓటీటీలను పర్యవేక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌పై కేంద్రం స్పందన ఏంటని సుప్రీం ప్రశ్నించింది. దీనిపై ఆరువారాల లోపు సమాధానమివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఓటీటీల నియంత్రణకు కొన్ని చర్యలు తీసుకొనే యోచనలో ప్రభుత్వం ఉందని అదనపు సొలిసిటర్‌ జనరల్ కేఎం నటరాజ్‌ ధర్మాసనానికి తెలిపారు. కేంద్రం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో ఆ వివరాలను ఆరు వారాల్లోపు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

గతేడాది అక్టోబరు 15న ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రం, ఐటీ మంత్రిత్వశాఖకు నోటీసులు పంపింది. ”కరోనా సమయంలో సినిమా థియేటర్లన్నీ మూసి ఉన్నప్పుడు అనేక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల్లోనే విడుదలయ్యాయి. ఆ కంటెంట్‌కు ఏ విధమైన నియంత్రణ లేదు. దీనిని పర్యవేక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి” అని ఆ పిటిషన్‌లో లాయర్లు శశాంక్‌ శేఖర్‌, ఆపూర్వ అర్హతియా పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *