ప్రభుత్వానికి మానవత్వం ఉంటే నిత్యావసరాలు ఉచితంగా ఇవ్వాలి!
పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు కన్నెబోయిన రామలక్ష్మి ప్రసాద్ డిమాండ్
తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట ప్రభుత్వం ప్రజలంతా కరోనా ప్రభావంతో అతలాకుతలం అవుతుంటే రేషన్ ధరలు పెంచటం దారుణమని అని పట్టణ తెలుగు మహిళ అధ్యక్షురాలు కన్నెబోయిన రామలక్ష్మి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరు అమాను షంగా ఉందని ఆరోపించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తెల్ల కార్డుదా రులకు అందించే కందిపప్పు పై కేజీకి 27 రూపాయలు, పంచదార పై కేజీకి 14 రూపాయలు పెంచుతూ ఈ నెల నుంచి సరఫరా చేయటం బాధాకరమని అన్నారు. గతంలో ప్రజా పంపిణీ ద్వారా ఇచ్చే దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తానని మోసం చేశారని ఇప్పుడు కరోనాతో ప్రజలందరూ జీవనోపాధి కోల్పోయి బ్రతుకు భారం గా ఉన్న సమయంలో రేషన్ ధరలు పెంచటం సమర్థనీయం కాదన్నారు. ఒకవైపు కరోనా తీవ్రంగా ఉందని ప్రజలంద రూ జాగ్రత్తగా ఉండాలని అసెంబ్లీలో లో సీఎం ఉపన్యాసాలు దంచుతూ మరోవైపు స్థానిక ఎన్నికలు నిర్వ హించలేమని చేతులెత్తి రేషన్ సరు కుల ధరలు పెంచటం సిగ్గుచేట న్నారు. జగనన్న చెప్పే మాటలకు చేతులకు పొంతన లేదన్నారు. ఒకవైపు రేషన్ సరుకులను ఇంటింటికి పంపిణీ చేస్తామని డాంబి కాలు పోతూ పరోక్షంగా పేదల పై 600 కోట్లు భారం మోపిందని విమర్శించారు. బహిరంగ మార్కెట్లో ధరకు రేషన్ ధరలకు పెద్ద వ్యత్యాసం లేదని ప్రజలే ఆ సరుకు లు ప్రజలే వద్దు అనుకునేలా ప్రభుత్వం తీరు ఉందని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల పట్ల మానవత్వం ఉండుంటే ఉచితం గా రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే పేదలు, ముఖ్యంగా మహిళలంతా ప్రభుత్వం పై తిరగబడి రోజులు దగ్గర్లోనే వస్తాయని అన్నారు.