తెలుగు తేజం , గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై తెల్లవారుజామున లారీని తప్పించబోయిన ఒక ఇన్నోవా కారు డివైడర్ వద్ద ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొని డివైడర్ పైకి ఎక్కింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిని వెళ్ళడానికి వీలులేకపోవడంతో కారును అక్కడే వదిలి కారులో ఉన్న వ్యక్తులు పరారయ్యారు. డివైడర్ పై ఉన్న కారును పోలీసులు పరిశీలించగా కారులో పెద్ద మొత్తంలో గంజాయి ఉండడంతో పోలీసులు అవాక్కయ్యారు. కారు ఏలూరు వైపు నుంచి విజయవాడ వైపు వెళుతూ ప్రమాదానికి గురయ్యింది. దీంతో పోలీసులు కారు మొత్తం పరిశీలించి కారులో ఎంత మంది ఉన్నారు, ఎక్కడ నుంచి ఎక్కడకు వెళుతున్నారు అనే అంశంపై వివరాలు సేకరిస్తున్నారు.