కోవిడ్-19నిబంధనలు పాటిస్తూ దేవాలయంలో పూజలు కు అనుమతి
పాండురంగడి బ్రహ్మోత్సవాలు ఏడాది లేవు.
తెలుగు తేజం, మచిలీపట్టణం : టాస్క్ ఫోర్స్ సమావేశం సోమవారం డీఈవో కార్యాలయంలో జరిగింది కార్తీక పౌర్ణమి సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు గురించి సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బందర్ ఆర్ డి ఓ ఖాజావలి వివరిస్తూ కరోనా వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎక్కడ సముద్రస్నానాలు అనుమతించలేదన్నారు. సముద్ర తీరం వెంబడి హంసలదీవి, పెదకళ్ళేపల్లి దేవాలయాలు మంగినపూడి బీచ్ నాగాయలంక, పెద్ద పట్నం బీచ్ తదితర ఘాట్ ల వద్ద సముద్ర స్నానాలు పూర్తిగా నిషేధించి నట్లు ఆర్డిఓ తెలిపారు. దేవాలయాల వద్ద ఒకసారి 50 మందికి మించి ఉంటే పూజలు జరుపుకో వచ్చని తెలిపారు. చిలకలపూడి పాండురంగ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించే రథోత్సవానికి ఈ ఏడాది అనుమతించడం లేదన్నారు. ఇంతకుముందు దసరా, వినాయక చవితి దీపావళి పండగలకు కూడా ఊరేగింపులు, ఉత్సవాలకు అనుమతించలేదని ఎవరి ఇళ్లలో వారు పూజలు నిర్వహించుకున్న విషయాలు ఆర్డీవో గుర్తు చేశారు. భక్తుల అందరూ అధికారులకు సహకరించాలని ఆర్డవో విజ్ఞప్తి చేశారు.బందరు డిఎస్పీ ఎం రమేష్ రెడ్డి మాట్లాడుతూ కరోనా nepadyaml కార్తీక మాసంలో జరిగే సముద్రస్నానాలు కు అనుమతి ఇవ్వడం లేదని టాస్క్ఫోర్స్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం పట్ల అన్యధా భావించవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు బతుకు జీవనం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకొని వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా వారి కార్యక్రమాలు జరుపుకోవచ్చు ఎలాంటి అసౌకర్యం కలిగిన అన్యదా భావించ వద్దని కోరారు ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎం శివరామకృష్ణ బందర్ గూడూరు తహసీల్దార్ డిష్ సునీల్ బాబు వనజాక్షి దేవాదాయ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు