Breaking News

భీమవరం గ్రామంలో కోరమండల్ వారి రైతు అవగాహన సదస్సు

తెలుగు తేజం, వత్సవాయి : వత్సవాయి మండలంలోని భీమవరం గ్రామంలో కోరోమండెల్ ఇంటర్నేషనల్ ఫర్టిలైజర్ కంపెనీ వారు మిరప పంటలో వాడే ఎరువుల గురించి సోమవారం అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోరోమండెల్ ఇంటర్నేషనల్ ఫర్టిలైజర్ కంపెనీ సీనియర్ ఆగ్రోనోమిస్ట్ రామకృష్ణ మరియు జూనియర్ ఆగ్రోనోమిస్ట్ సిహెచ్ శ్రీనివాస్ వీరు మాట్లాడుతూ స్థూల మరియు సూక్ష్మ పోషకాలు యాజమాన్యం గురించి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి రైతులకు మిరప పంటలు ఎరువులు ఏ విధంగా వాడాలి అనే విషయాన్ని వివరంగా రైతులకు అందించారు. అదేవిధంగా రైతులు అడిగిన ప్రశ్నలకు వారికి అర్థమయ్యే రీతిలో వివరించారు. ఒక ఎకరం మిరప తోటలో గ్రోస్మార్ట్ (24-24-0-8) 50kg మరియు సల్ఫమాక్స్ (గంధకం) 10kg కలిపి వాడుకోవాలని తెలియచేసారు. ఆక్యు స్ప్రే ఛిల్లి 1 కేజీ/ ఎకరం కి మిరప పంట లో
10 రకాల పోషకాలు అందుతాయి అంతేకాక మొక్క ఆరోగ్యంగా ఉంటుంది అని అన్నారు.
కోరమండల్ ఇంటర్నేషనల్ ఫర్టిలైజర్ కంపెనీ వారు తెలిపిన విధంగా ఈ మందులను వాడినట్లయితే అధిక దిగుబడి వస్తుందని రైతులు సంతోషంగా ఉండవచ్చునని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐ టి సి సుపీరియర్ రమేష్ మరియు రైతులు ఇతర సిబ్బంది పాలుగోన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *