Breaking News

కృష్ణలంక మూడోదశ రిటెయినింగ్ వాల్‌కు సీఎం జగన్ శంకుస్థాపన

తెలుగు తేజం, విజయవాడ: నగరంలోని కృష్ణలంక దిగువన వరద ముంపు నివారణ కోసం నిర్మించనున్న రిటైనింగ్‌ వాల్‌కు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కృష్ణా నది వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న కృష్ణలంక వాసులకు శాశ్వత పరిష్కారం కోసం కనకదుర్గమ్మవారధి మొదలు కోటినగర్‌ వరకూ సుమారు 1.5 కిలోమీటర్ల పరిధిలో రూ.125 కోట్లతో కృష్ణాకరకట్ట రక్షణగోడ నిర్మించనున్నారు. కృష్ణ లంక, రాణీగారి తోట వద్ద దుర్గావారధి సమీపంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని బుధవారం ఉదయం సీఎం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు, పేర్ని వెంకట్రామయ్య, అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, జే శ్యామలరావు, కలెక్టర్ ఎండీ ఇంతియాజ్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కరిమున్నీసా, ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, మొండితోక జగన్మోహనరావు, అబ్బాయి చౌదరి, కె.పార్థసారథి, జోగి రమేష్, గుడివాడ అమర్‌నాథ్, సింహాద్రి రమేష్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎంపీ నందిగామ సురేష్, మహిళా కార్పొరేషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గౌతమ్ రెడ్డి,స్థానిక కార్పోరేటర్ పుప్పాల కుమారి, స్థానిక నేతలు దేవినేని అవినాష్, పీవీపీ, బొప్పన భవకుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *