Breaking News

కొవిడ్‌ బాధిత విద్యార్థులకు మళ్లీ పరీక్షలు

వెల్లడించిన సీబీఎస్‌ఈ

దిల్లీ: కొవిడ్‌ సోకి ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరుకాని పది, పన్నెండో తరగతి విద్యార్థులు సెంటర్ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) ఊరట కల్పించింది. ఆ విద్యార్థులకు మరోసారి ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ”కరోనా సోకడం లేదా కుటుంబసభ్యుల్లో ఎవరికైనా కొవిడ్‌ పాజిటివ్‌ రావడం వల్ల ఏ విద్యార్థి అయినా ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరుకాలేకపోతే వారికి జూన్‌ 11లోగా మరోసారి అవకాశం కల్పిస్తాము. స్థానిక అధికార యంత్రాంగంతో చర్చించి తగిన సమయంలో వారికి ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తాం” అని సీబీఎస్‌ఈ ఓ సర్క్యులర్‌ తెలిపింది.

పది, పన్నెండో తరగతి విద్యార్థులకు మే 3 నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. మార్చిలో ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవి ఏప్రిల్ వరకు కొనసాగనున్నాయి. అయితే, కొవిడ్‌ వల్ల ఈ పరీక్షలు హాజరుకాలేని విద్యార్థులకు ఏప్రిల్‌ నెల లేదా రాతపరీక్షల తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. మరోవైపు పరీక్షల సమయంలో పాఠశాలలు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని బోర్డు స్పష్టం చేసింది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *