Breaking News

గ్రేటర్‌లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సర్కిళ్ల వారీగా ఆర్వోలు నోటీసులు విడుదల చేశారు. దీంతో నామినేషన్లు ఇవాళ్టి నుంచి ఈనెల 20 వరకు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి జీహెచ్‌ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రేటర్‌ పరిధిలోని అన్ని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈసారి ఆన్‌లైన్‌లో కూడా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. కానీ, ఆన్‌లైన్‌లో చేసిన దఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకుని సంబంధిత పత్రాలను నేరుగా ఆర్వోకి సమర్పించాలి. 21న నామినేషన్ల పరిశీలన, 22న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం కల్పించారు. 22వ తేదీ మధ్యాహ్నం 3గంటల తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *