తెలుగు తేజం, కొండపల్లి : కొండపల్లి సిపిఎం మాజీ సర్పంచ్, డాక్టర్ మామిడి మోహన్ రావు 48వ వర్థంతిని కొండపల్లి మోహన్ నగర్ , మోహన్ నగర్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం కొండపల్లి – మోహన్ రావు నగర్ శాఖ కార్యదర్శి డి.కాంతరావు పార్టీ జెండా ఎగురవేసి ప్రారంభించారు. డాక్టర్ మోహన్ రావు విగ్రహానికి మాజీ సర్పంచ్ కొల్లి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోహాన్ రావు జ్ఞాపకార్థం గత సంవత్సరం పదవ తరగతి లో మెరిట్ స్టూడెంట్స్ కి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి జాకీర్ హుస్సేన్ కాలేజ్ ప్రిన్సిపాల్ మహాబాషా , ఎం ఈ ఒ పుష్పలత, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ , కాంగ్రెస్ పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్ , సిఐటియు మండల కార్యదర్శి యం.మహేష్, డాక్టర్ మోహన్ రావు కుమారుడు డాక్టర్ యం.సీతారామరావు, వారి మనవడు డాక్టర్ యం.వి.మోహన్, కుటుంబ సభ్యులు మరియు సిపిఎం పార్టీ నాయకులు వి.మురళీ మోహన్, మాజీ సర్పంచ్ వి.అమ్మాజీ, ఈ.కొండలరావు, బడిషా వెంకటేశ్వరరావు , కె.బేబీ సరోజని, కోటేశ్వరరావు, కామేశ్వరరావు తదితరులు పోల్గోన్నారు.