Breaking News

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో అధినేత నారా చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. హైకోర్టు జడ్జికి.. అటు చంద్రబాబు తరఫున.. ఇటు సీఐడీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. రెండువైపులా వాదనలు పూర్తిగా వినాలన్న న్యాయస్థానం.. ఇందుకుగాను విచారణ వాయిదా వేయడం జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, పోసాని, దమ్మలపాటి శ్రీనివాస్, గింజుపల్లి సుబ్బారావు.. సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు వినిపించారు.

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈనెల 19కి హైకోర్టు వాయిదా వేసింది. సీఐడీ పిటిషన్‌పై ఈ నెల 18వరకు ఎలాంటి విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీఐడీ కస్టడీకి ఇవ్వద్దని చంద్రబాబు లాయర్లు ఏపీ హైకోర్టును విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన న్యాయస్థానం.. సోమవారం వరకు కస్టడీకి ఇవ్వొద్దని ఆదేశించింది. పూర్తి వాదనలు వినాల్సి ఉందన్న హైకోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టును ఆదేశించింది.

అభ్యంతరాలున్నాయా..?

చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోర్టును లాయర్లు కోరారు. యాంటీ కరప్షన్ యాక్ట్ సెక్షన్-13 ఐపీసీ 409 చెల్లవని క్వాష్ పిటిషన్‌లో బాబు పేర్కొన్నారు. సాక్ష్యాలు లేకున్నా రాజకీయ ప్రతికారంతోనే కేసు పెట్టారని పిటిషన్‌లో చంద్రబాబు లాయర్లు వివరించారు. అయితే.. అన్ని ఆధారాలతోనే రిపోర్టు ఇచ్చామని సీఐడీ తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్‌కు మారుస్తామని చంద్రబాబు లాయర్లకు కోర్టు తెలిపింది. ఇందుకు స్పందించిన లూథ్రా తనకు ఎలాంటి అభ్యంతరాల్లేవని తెలిపారు. అంతేకాదు.. గతంలో తాను పీపీగా చేశానని. అభ్యంతరాలు ఉంటే చెప్పాలని మరోసారి హైకోర్టు జడ్జి చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *