బాపులపాడు తెలుగు తేజం ప్రతినిధి :విజయవాడ నుంచి రాజమహేంద్రవరం పర్యటనకు వెళ్తున్న మంత్రి జోగి రమేష్ బాపులపాడు మండలం వీరవల్లి వద్ద గ్రామ వైకాపా నాయకులు, గౌడ సంఘం నాయకులు స్వాగతం పలికారు. మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న సందర్భంగా పుష్పగుచ్చాలు , శాలువలతో ఘనంగా సత్కరించారు. ఇటివల తాటిచెట్టు ఎక్కి కల్లు తీస్తుండుగా ప్రమాదవశాత్తు జారి పడి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరీదు శ్రీనివాసరావు విషయాన్ని గౌడ సభ్యులు మోర్ల అంజనేయలు , పామర్తి మాధవరావు , శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకురాగ తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జగనన్న లేఆవుట్లో ఇళ్లు నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని పరిశీలించాలని కోరగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్త్ తో కలిసి సందర్శిస్తానని చెప్పారు. లబ్ధిదారులకు రుణాలు సంబంధించిన బిల్లులు పెండింగ్ లేకుండా త్వరగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామ వైకాపా నాయకులు మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు గూడవల్లి రత్న సుధాకర్ , జిల్లా కార్యదర్శి కోడేబోయన బాబీ , అత్మూరి బాలాజీ , మోర్ల అంజనేయలు, జిల్లా మహిళ విభాగం కార్యదర్శి శివపార్వతి, మండల ఎస్సీ సెల్ నాయకులు తోమ్మండ్రు రమేష్ , గండి చిన్నారావు , జడ్పీ హైస్కూల్ పేరెంట్స్ కమిటీ వైస్ ఛైర్మన్ చందు రాజా , రాయి ప్రభుకుమార్ , పామర్తి ప్రభు , బెజవాడ కిషోర్ ,దేవరగుంట రాజా,తలారి ఈశ్వరరావు , పామర్తి మాధవరావు , తిరుమలరావు, మోర్ల గోపి ,ఆశోక్, యామలపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.