తెలుగు తేజం, నందిగామ : మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య తెదేపా నాయకులతో కలిసి నందిగామ మార్కెట్ యార్డ్ నందు నిల్వవున్న పత్తిని గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చందర్లపాడు గ్రామానికి చెందిన కట్ట లక్ష్మీనారాయణ గారి 46 పత్తి బోరాలు ఇంకా నందిగామ మార్కెట్ యార్డ్ నందు అలానే నిల్వ వున్నాయని ఎన్నో సార్లు భయర్లకు మా నుంచి విజ్ఞప్తి చేసామని. పత్తిని కొనుగోళ్లు చేయాలనీ బయ్యారు మాత్రం చాల నిర్లక్ష ధోరణితో వ్యవహరించారని మేము నందిగామ సి.సి.ఐ ప్రారంభం నుంచి బయ్యారు ధోరణిని ఎండగట్టం నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ అలానే స్థానిక శాసనసభ్యుడిని కోరడం జరిగినది రైతుల పక్షాన ఉండండని , రైతులకు న్యాయం చేయండి అని మీ నిర్లక్షధోరణి ఒక నిండు ప్రాణం బలిగొన్నది. మీరు ఎన్ని చేసిన ఆ నిండు ప్రాణం వెన్నకు తీసుకోని రాగలరా? ఈ రోజు చర్యలు తీసుకోవడం,హడావిడి చేయడం చేసేకన్నా బయ్యారుని మార్చి ఉంటె ఈ దారుణం జరిగేది కాదు దీని పూర్తి భాద్యత బయ్యారు వహించాలి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వహించాలి, అలానే లోకల్ ఎమ్యెల్యే వహించాలి.. రైతుల ప్రభుత్వం అని ఊరికే మాటలు కాదు చేతలలో చేసి చూపించండి రైతుపక్షనా నిలబడి భవిష్యత్ లో ఇలాంటి రైతు ఆత్మహత్యలను నిర్ములించండి. రైతు కట్ట లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి అలానే అయన కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలనీ ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.