తెలుగు తేజం, నందిగామ : పన్నులు చెల్లించకుండా సరైన రికార్డులు లేకుండా తిరుగుతూ పట్టుబడ్డ వాహనములను ఈనెల 18 వ తారీఖున బహిరంగ వేలం వేస్తున్నట్లు నందిగామ ప్రాంతీయ రవాణా శాఖ అధికారి సుబ్బారావు స్థానిక ఆర్డీవో కార్యాలయం నుండి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాహన తనిఖీల్లో రికార్డులు లేకుండా తిరుగుతున్నా వాహనాల పై కేసు నమోదు చేసి సీజ్ చేశామని. ఆ వాహనాల కోసం వాహన యజమానులు కానీ, ఫైనాన్షియల్ కానీ రాకపోవడంతో మోటార్ వాహన చట్టం కు లోబడి సీజ్ చేసిన వాహనాలను వేలం నిర్వహిస్తున్నట్లు ఆర్టీవో తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో వద్ద బహిరంగ వేలం వేస్తామన్నారు. ఈ వేలంలో మోటార్ సైకిళ్ళు, గూడ్స్ వెహికల్స్ సంబందించిన మొత్తం 41 వాహనాలను వేలం వేయడం జరుగుతుందన్నారు. వేలంలో పాల్గొదలచినవారు పూర్తి వివరాలు కలిగిన గుర్తింపు కార్డుల ఫోటో స్టార్ట్ కాపీలతో హాజరు కావాలన్నారు. ఒక్కో వాహనానికి రూ. 2,000/- లు ధరావత్తు సొమ్ము చెల్లించాలన్నారు. వేలంలో వాహనానికి అత్యధిక రుసుము (బీడ్) కోడ్ చేసినవారు అదే రోజు మొత్తం సొమ్ము చెలించాలన్నారు. పార్కింగ్ రుసుము కూడా చెలింఛాలన్నారు.