తెలుగు తేజం, మచిలీపట్టణం : కోవిడ్ కారణంగా మూసివేసిన పాఠశాలలు తిరిగి నవంబర్ 2 నుంచి ప్రారంభమయిన విషయం తెలిసినదే. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందరికీ ఆయా మండలాల్లోని వైద్య సిబ్బంది క్రమ పద్ధతిలో పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 2 నుంచి 16 వరకు జరిగిన కరోనా పరీక్షల్లో పలువురికి పాజిటివ్ గా తేలింది .జిల్లాలో 101 మంది ఉపాధ్యాయులకు, 58 మంది విద్యార్థు లకు పాజిటివ్ గా తేలిందని డీఈఓ రాజ్యలక్ష్మి తెలిపారు. సోమవారం జరిపిన కరోనా పరీక్షల్లో ఒక టీచర్ కు, 10 మంది విద్యార్థులు కరోనా బారిన పడినట్లు తెలిపారు. చలికాలం కారణంగా కరోనా వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని. కనుక అందరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఈఓ రాజ్యలక్ష్మి సూచించారు.