Breaking News

ప్రజలతో మమేకమై ప్రచారంలో దూసుకుపోతున్న టిడిపి సర్పంచ్ అభ్యర్థి తంగిరాల రమ్య

తెలుగు తేజం, కంచికచర్ల : మండలం పరిటాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి తంగిరాల రమ్య గ్రామ అభివృద్దికి పాటుపడతానని గ్రామంలో త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచుస్థనని అంతర్గత రోడ్లు అభివృద్ధి చేస్తారని కులమతాలకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల అందే విధంగా చూస్తానని పరిటాల సర్పంచ్ అభ్యర్థి హామీ ఇచ్చారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ గ్రామాభివృద్ధికి కృషి చేసేందుకు అవకాశం ఇచ్చిన నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రామ ప్రజలందరు నాకు ఓటు వేసి నన్ను గెలిపించి గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మాగంటి బాబు, మాగంటి పుల్లారావు, డాక్టర్ వెంకటరత్నం, డాక్టర్ వీరస్వామి, మాజీ ఎంపీపీ పరిటాల గ్రామం భాగ్యలక్ష్మి, మాజీ సర్పంచ్ తంగిరాల పద్మావతి, షేక్ మునీ, తంగిరాల జోసఫ్, మార్తా పుల్లయ్య, మార్తా పరదేశి బలుసుపాటి గురవయ్య, 2వార్డు సభ్యుడు నెలకుదిటి మధుసూదన్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…..

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *