తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్లలోని వసంతకాలనీలో కల కృపా ప్రార్ధనా మందిరంనందు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కంచికచర్ల మండల సర్వసభ్య సమావేశం నియోజకవర్గ అధ్యక్షులు సూర్యప్రకాష్ అధ్యక్షతన జరిగినది. రాష్ట్ర అధ్యక్షులు బొక్కా జార్జి ముల్లర్ ఎన్సిసి విధివిధానాలు తెలియజేస్తూ బైబిల్ లో పొందుపరిచినట్లుగా ప్రతి క్రైస్తవుడు మంచి సైనికుడు వలె పోరాడాలని, చివరి క్షణము వరకు క్రైస్తవులందరూ డినామినేషన్ బేదం లేకుండా కలిసికట్టుగా ఏకతాటిపై నిలబడాలని పిలుపునిచ్చారు .కోస్టల్ రీజన్ కోఆర్డినేటర్ పాల్ శంకర రెడ్డి, కృష్ణా జిల్లా అధ్యక్షులు హనోకు, జిల్లా ప్రధాన కార్యదర్శి హిజ్కీయ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు కోటా రాంబాబు, నెహేమ్య, కంచికచర్ల మండల అధ్యక్షులు భాగ్యరావు, కార్యదర్శి విల్సన్, కోశాధికారి కృపారావు, దేవ సహాయం, షాలేమ్, మాడుగుల రాజేష్, ఇమ్మానుయేలు తదితరులు పాల్గొన్నారు.