తెలుగు తేజం, కంచికచర్ల : కోవిడ్ కారణంగా మూసివేసిన పాఠశాలలు తిరిగి నవంబర్ 2 నుంచి ప్రారంభమయిన విషయం తెలిసినదే. ఈ క్రమంలో పాఠశాలకు వచ్చే 9, 10 తరగతుల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందరికీ ఆయా మండలాల్లోని వైద్య సిబ్బంది క్రమ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. గడిచిన వారం రోజులుగా ముమ్మరంగా జరుగుతున్న కరోనా పరీక్షల్లో పలువురికి పాజిటివ్ గా తేలింది .కృష్ణా జిల్లాలోని కంచికచర్ల హైస్కూల్లో ఆరుగురు ఉపాధ్యాయులకు ఒక విద్యార్థికి పాజిటివ్ వచ్చింది. అలాగే వత్సవాయి హైస్కూల్లో ముగ్గురు విద్యార్థులకు, భీమవరం హైస్కూల్లో ఒకరికి, వీరులపాడు లో ఒకరికి, గుడిమెట్ల హైస్కూల్లో ఇద్దరికీ తోటరావులపాడు లో ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది దీంతో ఆయా స్కూళ్లల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.