కంచికచర్ల (తెలుగు తేజం ప్రతినిధి) :కంచికచర్ల మార్కెట్ యార్డ్ లో మండలంలో గల ఆటోడ్రైవర్లకు సోమవారం నాడు రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందిగామ డిఎస్పీ నాగేశ్వర్రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల పై ఆటోడ్రైవర్లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది తెలియజేశారు. వాహనాలు నడిపే సమయంలో మరియు ఆటోలను నడిపే సమయంలో పరిమితికి మించి వేగం నడప రాదని పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించారని ప్రమాదాలు ఎక్కువ జరగటానికి గల కారణం రాత్రింబవళ్ళు తీరిక లేకుండా వాహనాలు నడపడం వల్ల శారీరక అలసట వల్ల ప్రమాదాలు జరుగుతాయని సరైన పత్రాలు డ్రైవింగ్ పట్ల అవగాహన లేకపోవడం వలన కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయని తెలియజేశారు. కాబట్టి ఆటో డ్రైవర్లు తమ వాహనాలను నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రూరల్ సీఐ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ ఆటోలలో టేపు రికార్డులను ఉపయోగించరాదని వ్యవసాయ కూలీలను పరిమితికి మించి ఆటోలలో ఎక్కితే చట్టపరమైన చర్య కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంచికచర్ల ఎస్సై రంగనాథ్ మాట్లాడుతూ వాహనాలను నడిపే సమయంలో మీకోసం మీ కుటుంబ సభ్యులు భార్య పిల్లలు ఎదురు చూస్తారు అన్న విషయాన్ని మర వద్దని హితవు పలికారు. అతివేగం పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం చట్టరీత్యా నేరమని అన్నారు. మహిళా ఎస్సై లక్ష్మి మాట్లాడుతూ పాత ఆటోలను కొనే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆటోడ్రైవర్లకు వివరించారు. పాత వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా ఆ వాహనాలపై గల కేసులు రోడ్ టాక్స్ ఇన్సూరెన్స్ తదితర అంశాల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ అంశాలన్నీ తమ దృష్టికి వచ్చినవి కాబట్టి తెలియజేస్తున్నామని పాత వాహనాలు కొనే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో నందిగామ డి.ఎస్.పి నాగేశ్వర్ రెడ్డి నందిగామ రూరల్ సీఐ నాగేంద్ర కుమార్ కంచికచర్ల ఎస్సై రంగనాథ్ మహిళా ఎస్సై లక్ష్మి మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు