Breaking News

‘ప్రాణాలు పోతున్నా తేదీలు మార్చకూడదా?’

ఈసీని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: పట్టభద్రుల ఎన్నికల ఓటరు నమోదు గడువు పొడిగించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. డిసెంబర్ 7 వరకు నమోదు గడువును పొడిగించాలన్న తన అభ్యర్థనపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించడం లేదని న్యాయవాది రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ 1 నుంచి నవంబరు 7 లోగా దరఖాస్తులు స్వీకరించాలని చట్టంలో ఉందని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. రాష్ట్రంలో విపత్తులు వచ్చినా, ప్రజల ప్రాణాలు పోతున్నా తేదీలు మార్చకూడదా? అని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. అయితే డిసెంబర్‌ 1 నుంచి 31వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వినతిపత్రంపై ఏ నిర్ణయం తీసుకున్నారో రేపు తెలపాలని ఈసీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేని వారు డిసెంబర్‌ 1 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చో లేదో స్పష్టత ఇవ్వాలని ఈసీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *