Breaking News

బాదుడు జగన్ కి బ్యాడ్ నేమా.? గుడ్ నేమా..!?

తెలుగుతేజం, అమరావతి : రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయింది. ఆర్ధిక పరిస్థితి అట్టడుగుకు చేరింది. మూడు నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి. సంక్షేమ పథకాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి. దీంతో రాష్ట్రం ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. మద్యం ధరలు పెంచడం, అదనపు సుంకాలు మోపడం, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం, పెట్రోలుపై అదనపు సుంకం పెంచడం చేసింది. ఇప్పుడు.. వాహనదారులు రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధించేలా మూడు రోజుల కిందట సీఎం జగన్ ఓ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. సినిమాలో (భరత్ అనే నేను) చూడడానికి బాగానే ఉన్నా నిజ జీవితంలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వ్యాపారం చేసుకుంటూ చిన్న, చిన్న ట్రక్కులు నడిపే వారికి వేలల్లో బిల్లులు వస్తూండటంతో.. మేం కట్టలేం బాబో అంటూ రోడ్డు మీదే బోరున విలపిస్తున్నారు. మరి.. సీఎం జగన్ కు ఈ నిర్ణయం మేలు చేస్తుందా..!

సామాన్యుల వల్ల అయ్యేది కాదు..

ప్రస్తుతం రోడ్ల మీదకు వాహనాలు రావాలంటే దడ పుట్టేస్తోంది వాహనదారులకు. అంతలా పెంచారు రేట్లు. అసలే మన ఇరుకు రోడ్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కువ. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలు ఎక్కువ. రాంగ్ రూట్, ఓవర్ లోడ్.. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. రూల్స్ పాటిద్దాం అనేవారి కంటే అక్కడివరకూ వస్తే ఫైన్ కట్టేద్దాంలే అనుకునే వారే ఎక్కువ. ఇది తెలిసే ప్రభుత్వం రోడ్ సేఫ్టీ, పబ్లిక్ సేఫ్టీ అంటూ ఫైన్లు పెంచేసింది. ఫైన్లు పెంచింది కానీ.. ప్రజల్ని కంట్రోల్ లో పెట్టడం కష్టం. మన కోసమే ప్రభుత్వం ఇలా చేస్తోంది అని ఆలోచించేవారి కంటే.. ఇలా చేస్తోందేంటి.. అని ఆలోచించేవారే ఎక్కువ. కారణం.. ఎక్కువ శాతం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలపైనే ఇక్కడ ఎఫెక్ట్ పడేది.

ప్రభుత్వ తీరు ప్రజలకు రుచిస్తుందా..

చిన్న చిన్న వ్యాపారాలు, వీధి వ్యాపారులు, పొట్టకూటి కోసం చేసుకునే వారు రవాణా శాఖకు చిక్కితే ఇంతే సంగతులు. వేలకు వేలు కట్టాలంటే వారి వల్ల కాదు. అలా అని ట్రాఫిక్ రూల్స్ పాటించరు. సాధారణ ప్రజానీకంలో వచ్చే ఆలోచన.. సంక్షేమ పథకాల కోసం ఇలా ప్రతిదానిపై పన్నులు వేసేస్తున్నారు అనే ఆలోచనే వస్తుంది. జగన్ సీఎం అయ్యాక తాను ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. కానీ.. నేను ఇచ్చాను.. మీరు కూడా కొంత ఇచ్చుకోవాల్సిందే అనిపించే ఈ పన్నులు, ఫైన్లు సామాన్యుడికి రుచించవు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *